సరోగసీ నియంత్రణ బిల్లుకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అద్దె గర్భ నియంత్రణ బిల్లును పటిష్టంగా అమలు చేసే విధంగా రూపొందించారు. కమర్షియల్ సరోగసీని నిషేధించాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. నిస్వార్థంగా అద్దెగర్భ విధానం అమలుకు చర్యలను సూచించారు. వచ్చే నెలలో జరగనున్న రెండవ దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలోని సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదిత సరోగసీ నియంత్రణ బిల్లును రిఫర్ చేసినట్లు సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరిగింది.