ఇరాన్‌లో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 1812కు చేరుకున్నది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి కియనోష్ జహాన్‌పూర్ తెలిపారు. దేశంలో మొత్తం 23 వేల 49 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆయన చెప్పారు. దాంట్లో సుమారు 9 వేల మందికి కరోనా నయమైంది. నిన్నటి నుంచి 1411 కొత్త కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 36 మిలియన్ల మందిని కరోనా స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు.