కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. హాట్‌స్పాట్ లేని ఏరియాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొంత సడలింపు కేంద్రం తెలిపింది.